ప్రారంభమైన పోలింగ్ : 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు బైపోల్

POLINGదేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్న 4 లోక్ సభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్ సోమవారం (మే-28) ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ గఢ్, భండారా-గోండియా, నాగాలాండ్ పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. వివిధ రాష్ర్టాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా… ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

మే 31న ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు జరగుతున్న 4 పార్లమెంటు స్థానాల్లో 3 బీజేపీవి కాగా… ఒకటి ఎన్ డీఏ భాగస్వామి పీడీఏ పార్టీది. మహారాష్ట్రలోని ఎస్టీ రిజర్వుడ్ పాల్ గఢ్ స్థానంలో బీజేపీ నేత చింతామణ్ వాంగా మృతితో ఉపఎన్నిక జరుగుతుంది. ఇక్కడ ఆశ్చర్యకమైన పోటీ నెలకుంది. నామినేషన్లకు కొన్నిగంటల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు గోడదూకారు. చింతామణ్ కుమారుడు శ్రీనివాస్ వాంగా బీజేపి నుంచి శివసేనలో చేరగా.. కాంగ్రెస్ నేత రాజేంద్ర గావిట్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థిగా దామోదర్ బర్కూ శింగాడ బరిలో నిలిచారు. ఇక్కడి త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates