శాసనమండలి సమావేశాలు ప్రారంభం

శాసనమండలి పదో సమావేశం ఇవాళ (సెప్టెంబర్-27) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల మండలి సంతాపం వ్యక్తం చేసింది.

కొండగట్టు RTC బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేసింది మండలి.  తొమ్మిదో సభ జరిగి ఆరునెలలు గడుస్తున్న క్రమంలో నిబంధనల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. శాసనసభ రద్దయిన తర్వాత శాసనమండలి మాత్రమే సమావేశం కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటినుంచి కూడా చరిత్రలో ఇదే మొదటిసారి.

Posted in Uncategorized

Latest Updates