ప్రింటింగ్ కాకుండా : కొత్త 100 నోటు కోసం.. 100 కోట్లు ఖర్చు

కొత్త 100 నోటు వస్తుందని సంబుర పడుతున్నాం.. అదే 100 నోటు కోసం.. మరో 100 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారు. ప్రింటింగ్ ఖర్చు కాకుండా ఇది అదనం. కారణం ATM. అవును.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం మెషీన్స్ పాత 100 నోటుకి తగ్గట్టు సాఫ్ట్ వేర్, బాక్స్ ఫిక్స్ అయ్యింది. కొత్తగా వచ్చే 100 నోటు పాత నోటుతో పోల్చితే కొంచెం చిన్నగా ఉంటుంది. దీనికితోడు ఫీచర్స్, కలర్ అంతా తేడా. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎం మెషీన్స్ ను మార్చాలని.. సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలి.. దీని కోసం అక్షరాల 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని ఏటీఎంల్లో కొత్త 100 నోటు రావాలంటే కనీసం ఏడాది అయినా సమయం పట్టే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా 2లక్షల 40వేల ఏటీఎం మెషీన్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ కొత్త 50 నోటు రావటం లేదు. ఇప్పుడు కొత్త 100 నోటు. ప్రస్తుతం అప్ డేట్ చేసే సమయంలో 100, 50 నోట్లను కూడా మెషీన్స్ లో ఉంచాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎం మెషీన్స్ నుంచి కొత్త 100, 50 నోట్లు తీసుకోవాలంటే.. కనీసం ఏడాది సమయం ఆగాల్సిందే. ఈలోపు అక్కడక్కడా.. కొన్ని బ్యాంకు ఏటీఎం  మెషీన్స్ లోనే దొరుకుతాయి. దీనికే 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates