ప్రింటింగ్ ప్రారంభం : పర్పుల్ కలర్ లో.. కొత్త రూ.100 నోట్లు

నోట్ల రద్దు తర్వాత.. అన్నీ కొత్త నోట్లే వచ్చాయి. ఒక్క 100 నోటు తప్పితే. ఇప్పుడు అది కూడా మారిపోతుంది. కొత్త 100 నోట్ల ప్రింటింగ్ ప్రారంభించారు. పర్పుల్ (వంకాయ) రంగులో ఈ నోట్లు ఉండబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ నోట్లు విడుదల అవుతాయని.. పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది RBI. బ్యాంకుల ద్వారా వీటి పంపిణీ ఉంటుంది. బ్యాంక్ కు వెళ్లే పాత నోటు స్థానంలో.. కొత్త 100 నోటు బయటకు వస్తోంది. ఆగస్ట్ మొదటి వారంలోనే ప్రజల చేతుల్లో పెద్ద సంఖ్యలో 100 నోట్లు ఉండనున్నాయి.

కొత్త 100 నోట్లు ఇలా ఉండబోతుంది :

… దివాస్ బ్యాంక్ నోట్ ప్రెస్ లో BNPలో కొత్త 100 నోట్లు ప్రింటింగ్ ప్రారంభం అయ్యింది.

… కొత్త 100 నోటు పర్పుల్ కలర్ లో ఉండబోన్నది.

… ఆగస్ట్ మొదటి వారంలో కొత్త నోట్లు మార్కెట్ లోకి వస్తాయి.

… మిగతా నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. 500, 2వేల నోట్లు ప్రింట్ చేసిన ప్రెస్ లోనూ 100 నోట్లు కూడా ప్రింట్ అవుతున్నాయి.

… కొత్త నోట్లు వచ్చినా.. పాత నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Posted in Uncategorized

Latest Updates