ప్రిన్సిపాలా.. పశువా : భోజనం బాగోలేదంటే.. పిల్లోడిని చావకొట్టాడు

STUDENTవిద్యాబుధ్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పాలిట శాపంలా మారుతున్నారు. స్కూల్లో మధ్నాహ్న భోజనం సరిగాలేదన్నందుకు స్టూడెంట్ ని కొట్టి చంపాడు ఓ ప్రిన్సిపాల్. ఈ దారుణ సంఘటన మంగళవారం (మే-22) డెహ్రాడూన్ లో జరిగింది. డెహ్రాడూన్‌ లోని ఓల్డ్‌ ధలన్‌ వాలా ప్రాంతానికి చెందిన రాహుల్ (11) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో.. రాహుల్ ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ బానో దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సింది పోయి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రాహుల్‌ ను ఇనుపరాడ్‌ తో కొట్టారు. దీంతో రాహుల్‌ కు గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

రాహుల్ తండ్రి ధర్మేంద్రపాశ్వాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. రాహుల్‌ పై ప్రిన్సిపాల్ దాడి ఘటనతో ఆగ్రహం ఊగిపోయిన గ్రామస్థులు స్కూల్ ప్రాంగణంలో సామాగ్రిని ధ్వంసం చేశారు.

Posted in Uncategorized

Latest Updates