ప్రియాంకను పెళ్లి చేసుకోవడం.. నిక్ కు ఇష్టంలేదట

డిసెంబర్ 1న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ల వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో వీరి పెళ్లిపై ఓ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ప్రియాంక, నిక్ ల వివాహంపై న్యూయార్క్‌ కు చెందిన ఓ మ్యాగజైన్ హాట్ న్యూస్ వెల్లడించింది.

ఈ పెళ్లి నిక్ కు ఇష్టం లేదని.. ప్రియాంక బలవంతం మీదనే నిక్ పెళ్లి చేసుకోవాల్సివచ్చిందని తెలిపింది. మారియా స్మిత్ అనే లేడీ జర్నలిస్ట్ ఈ కథనాన్ని రాశారు. ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. వీరితో పాటే నిక్ సోదరుడు మ్యాగజైన్  కథనాన్ని ఖండించాడు. అది చాలా అసహ్యకరమైన స్టోరీ అని.. ఆ వార్తను ప్రచురించినందుకు మ్యాగజైన్ నిర్వాహకులు సిగ్గుపడాలని సీరియస్ అయ్యారు. ప్రియాంకపై జాతి వివక్షతో రాశారని సోనమ్ కపూర్ చెప్పింది. పెరుగుతున్న వ్యతిరేకతతో మ్యాగజైన్ నిర్వాహకులు వెబ్‌ సైట్ నుంచి ఆ ఆర్టికల్ ను తొలగించారు.

ఈ విష‌యంపై స్పందించింది ప్రియాంక. పిచ్చి క‌థ‌నాల‌ని నేను ఏనాడు ప‌ట్టించుకోలేదు, ప‌ట్టించుకోను. ఈ విష‌యం గురించి నేను మాట్లాడాల‌ని అనుకోవ‌డం లేదు. ఇలాంటి విష‌యాలు నా ప‌రిధిలోకి రావు. ప్ర‌స్తుతం నేను చాలా హ్యాపీ లైఫ్ గ‌డుపుతున్నాను. ఈ చెత్త వార్త‌లు నన్ను ఏ మాత్రం డిస్ట‌ర్బ్ చేయ‌లేవు అని తెలిపంది ప్రియాంక చోప్రా.

Posted in Uncategorized

Latest Updates