ప్రియా ఏంటమ్మా ఇది : కళ్లు ఎగరేసింది.. కన్ను కొట్టింది కాపీనా

priyasfsdతన క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ తో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆదార్ లవ్ అనే మళయాళ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట‌లో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌కి  దేశం ఫిదా అయ్యింది. అప్పటి నుంచే వివాదాలు కూడా మొదలయ్యాయి. ముస్లిం మనోభావాలు అంటూ కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లింది వ్యవహారం. నిన్ననే కోర్టులో ఊరట దొరికింది. ఇంతలోనే మరో వివాదం మొదలైంది.

ఈ లవ్ సీన్ ను తన కొత్త సినిమా “కిడు” నుంచి కాపీ కొట్టారంటూ మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ మాజిద్ అబు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కిడు, ఒరు ఆదార్ ల‌వ్ ఈ రెండు సినిమాలకు ఎడిట‌ర్ ఒకరే అని.. మా సినిమా పూర్తైన త‌ర్వాత  ఆ ఎడిట‌ర్ ఒరు ఆదార్ ల‌వ్ సినిమాను ఎడిట్ చేశాడని చెబుతున్నారు. ఈ సమయంలో మా సినిమాలోని ల‌వ్ సీన్ కాపీ జ‌రిగింద‌న్నారు మ‌ల‌యాళ డైరెక్టర్ మాజిద్ అబు ఆరోపణ. దీనిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆశ్రయిస్తానని చెబుతున్నాడు.

ఎడిటర్ ద్వారా ఈ సీన్ ను కాపీ చేశారనటానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పాట రిలీజ్ అయ్యింది ఫిబ్రవరి 9వ తేదీ.. మరి ఈ రెండు వారాలపాటు ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది కూడా క్వశ్చన్. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే కంప్లయింట్ చేయొచ్చు.. కాపీ అని ఆరోపించొచ్చు.. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నాడు.. ఎందుకు కంప్లయిట్ చేయాలని నిర్ణయించుకన్నాడు అనేది కూడా డైరెక్టర్ అబునే చెప్పాలి..

Posted in Uncategorized

Latest Updates