ప్రియుడి మృతిని తట్టుకోలేక.. యువతి సూసైడ్

love deathప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు చనిపోవడంతో.. తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో శుక్రవారం (జూలై-6) రాత్రి చోటుచేసుకుంది. చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌కు చెందిన నటరాజన్‌ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్‌ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లారు. వారితో అశ్విని వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా గడిపింది. ఆ సమయంలో తెన్నవన్‌ ఓ రోజు ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తిరువొత్తియూరు శివశక్తినగర్‌లోని పెదనాన్న ఇంట్లో మూడు నెలలుగా అశ్విని ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని పెదనాన్న, కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సాతాన్‌ గాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates