ప్రీపెయిడ్ లో ఐడియా సరికొత్త ప్లాన్

IDEAజియో పుణ్యమా అని టెలికం సంస్థలు పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తుండగా లేటెస్ట్ గా..
కస్టమర్ల కోసం మరో న్యూ ప్లాన్ ను తీసుకొచ్చింది ఐడియా. తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ నూతన ప్లాన్‌ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.499కి లభిస్తున్న ఈ ప్లాన్‌ లో కస్టమర్లకు మొత్తం 82 రోజుల వాలిడిటీకి గాను 164 GB డేటా వస్తుంది. దీన్ని రోజుకు 2GB చొప్పున వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో వినియోగదారులకు అన్‌ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS లు వస్తాయి. జియోలో రూ.498 ప్లాన్‌ లో 91 రోజులకు 182 జీబీ డేటా లభిస్తుండగా, ఎయిర్‌ టెల్‌ లో రూ.499 ప్లాన్‌ కు 82 రోజులకు 164GB డేటా వస్తున్నది. ఈ క్రమంలోనే ఈ ప్లాన్లకు పోటీగా ఐడియా రూ.499 ప్లాన్‌ ను అందుబాటులోకి తెచ్చింది.

Posted in Uncategorized

Latest Updates