ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా విజయకుమార్‌రెడ్డి

vijayహైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్‌ శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆదివారం(జూన్-24) ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్‌ రావుపై విజయం సాధించారు. రాజమౌళిచారికి 349 ఓట్లు, శ్రీనివాస్‌కు 280 ఓట్లు లభించాయి. కోశాధికారిగా సురజ్‌ వి భరద్వాజ్‌ 29 ఓట్ల తేడాతో దుగ్గు రఘుపై విజయం సాధించారు. సురజ్‌కు 324 ఓట్లు లభించగా, దుగ్గు రఘుకు 295 ఓట్లు వచ్చాయి.

ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్‌ నాయుడు 138 ఓట్ల తేడాతో మారం శ్రీనివాస్‌పై విజయం సాధించారు. వేణుగోపాల్‌కు 383 ఓట్లు లభించగా శ్రీనివాస్‌కు 245 ఓట్లు లభించాయి. మహిళా కోటాలో ఉపాధ్యక్షురాలిగా రెహనా బేగం 154 ఓట్ల తేడాతో ఎ.సరితపై విజయం సాధించారు. రెహనాకు 395 ఓట్లు, సరితకు 241 ఓట్లు వచ్చాయి. సహాయ కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా సీహెచ్‌ గణేశ్‌, కట్టా కవిత, ఉమాదేవి, అనిల్‌ కుమార్, అమిత్‌ భట్టు, యశోద, కస్తూరి శ్రీనివాస్, వసంత కుమార్, నంద్యాల భూపాల్‌ రెడ్డి, రజనీకాంత్‌ ఎన్నికయ్యారు. ప్రెస్‌క్లబ్‌లో మొత్తం 1,313 ఓట్లకు 1,100 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates