ప్రేమలోకి దింపి..నడిరోడ్డుపై వదిలేశాడు : శిల్పాశెట్టి

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన చిన్నప్పటి లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ఓ టీవీ షో సందర్భంగా తన లవ్ స్టోరీని తెలిపిన శిల్పా..  టీనేజ్ లో తన లవ్ ఫెయిల్ అయ్యిందని చెప్పింది. తాను కాలేజీ చేసే రోజుల్లో ఓ అబ్బాయి ప్రతి రోజు సాయంత్రం తన ఇంటికి ఫోన్‌ చేసేవాడని.. ఆ వయసులో ఆ మాటలకు అట్రాక్ట్ అయ్యానని చెప్పింది. అప్పట్లో ల్యాండ్‌ లైన్‌ ఫోన్ మాత్రమే ఉండేదని.. అతడి ఫోన్‌ కోసం ప్రతి రోజు సాయంత్రం ఎదురుచూసేదాన్ని అని చెప్పింది.

వాళ్ల నాన్న ఇంటికి వస్తే.. ఫోన్‌ కట్‌ చేసేదాన్నని..ఆ అబ్బాయి తన పేరు కూడా చెప్పలేదని తెలిపింది. ఫోన్ మాట్లాడుతూ కొన్ని రోజులు గడిచాక.. ఇవాళ మనం బస్టాప్‌ లో కలుద్దాం అని ఓ రోజు చెప్పిందట శిల్పశెట్టి. అయితే.. అతడు రాలేదని.. దీంతో అతడితో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుందట. కొన్ని రోజుల తర్వాత అసలు విసయం తెలిసిందట..శిల్పాశెట్టిని లవ్ లో పడేస్తానని ఫ్రెండ్స్ తో ఆ అబ్బాయి బెట్ కట్టాడని. అందుకే తనతో ఆ బాలుడు ప్రేమ అని నటించాడని చెప్పింది శిల్పా. ఇదంతా ఓ సినిమా కథలా అనిపించింది.. కానీ ఇది నిజం అని చెప్పిన ఆమె.. తర్వాత ఆ అబ్బాయి కూడా తనతో బంధాన్ని తెంచుకున్నాడని చెప్పింది. బెట్ లో గెలవడమే ఆ అబ్బాయి లక్ష్యం. కానీ తనను సిన్సియర్ గా లవ్ చేయలేదని తెలుసుకుందట. దీంతో కొన్ని రోజుల వరకు ఆవేదనకు గురయ్యాయని.. గుండె పగిలి బాధపడ్డా అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి.

Posted in Uncategorized

Latest Updates