విశ్వహిందూ పరిషత్ యూటర్న్ : ప్రేమికులకు విషెస్

praveen-togadia

ప్రేమికుల రోజుపై విశ్వహిందూ పరిషత్ (VHP) యూటర్న్ తీసుకుంది. దీనిపై VHP అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా లవర్స్ నమ్మలేని వ్యాఖ్యలు చేశారు. యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉందన్నారు.  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్ కార్యకర్తలు ర్యాలీలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాశ్చాత్య విష సంస్కృతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని దీన్ని నిషేధించాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి.

అయితే ఎప్పుడూ ప్రేమికులరోజు జరుపుకోవద్దని చెప్పే కపాడియా ఈ సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేమికులకు ఆశ్చర్యం కలిగించేలా VHP అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఫిబ్రవరి-12) చండీగఢ్‌లో ప్రేమికుల రోజు సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువతీ యువకులు ప్రేమలో పడకపోతే పెళ్లిళ్లు జరగవని.. ఒక వేళ వివాహాలు జరగకపోతే ప్రపంచం పురోగమించదన్నారు. యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉందన్నారు. మన కూతుళ్లు, సోదరీమణులకు ప్రేమించుకునే హక్కు ఉందనే మెసేజ్ ను ప్రచారం  చేస్తానన్నారు కపాడియా.

Posted in Uncategorized

Latest Updates