ప్రేమికులరోజు.. కుక్క, గాడిదకి పెళ్లి

DOGవాలెంటైన్స్ డే సందర్భంగా భజరంగ్ దళ్, VHP కార్యకర్తలు ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని చెప్పడం కామన్. అయితే ఈ కార్యకరక్తులు బుధవారం (ఫిబ్రవరి-14) ఓ జంటకి పెళ్లి చేశారు. అయితే అది లవర్స్ జోడీ కాదులెండీ. చెన్నైలో బుధవారం (ఫిబ్రవరి-14) ఓ కుక్క..గాడిదకి పెళ్లి చేశారు.  డప్పు వాయిద్యాలతో, పూలు పండ్లు పెట్టారు. కుక్కను, గాడిదకు బట్టలు వేసి,  అందంగా ముస్తాబుచేశారు.

బ్యాన్ వాలెంటైన్స్ డే అంటూ నినాదాలు చేస్తూ పెళ్లి జరిపించినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు.   ప్రేమికులరోజును వ్యతిరేకిస్తూ వెరైటీ నిరసనగా ఇలా చేశామని చెబుతున్నారు. దీంతో నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. భక్తి మార్గంలో ఉండే భజరంగ్, VHP సంస్థులు ఇలా జంతువులపై హేళన చేయడం తగదంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates