ప్రేమోన్మాదం : పెళ్లికి ఒప్పుకోలేదని…పెట్రోల్ పోసి తగులబెట్టాడు

ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెండ్లికి నిరాకరించిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని.. ప్రేమించిన యువతిని కౌగిలించుకున్నాడు. యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన యువతి వదినకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతూ యువతి, ప్రేయోన్మాది ఇద్దరూ చనిపోయారు. యువతి వదిన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
సీఐ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం…ఇబ్రహీం(30) కొన్నేళ్లుగా బహ్రెయిన్‌ లో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి షబానా బేగం(19)తో ఏడాది నుంచి ఫేస్‌బుక్‌ లో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు. పెండ్లి చేసుకుంటానని యువతికి చెప్పాడు. దీంతో షబానా కుటుంబ సభ్యులు ఇబ్రహీం గురించి విచారణ చేయడంతో అప్పటికే అతనికి పెండ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం బయటపడింది. దీంతో అతడి గతం తెలిసి, మందలించి.. మాట్లాడడం మానేసింది షబానా. బుద్ధి మార్చుకోని ఇబ్రహీం ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోవాలని వేధించడంతో విసిగిపోయిన యువతి అతడిపై పోలీసులకు కంప్లెయింట్ చేసింది.

బక్రీద్‌ కు సెప్టెంబర్ లో హైదరాబాద్‌ కు వచ్చిన ఇబ్రహీం.. సబీనా సోదరుడికి ఫోన్‌ చేసి తనపై కేసులు పెట్టొద్దని బతిమలాడాడు. శనివారం ఉదయం షబానా తల్లి, అన్న బయటకు వెళ్లగా… ఇంట్లో వదిన అజీమా బేగంతో కలసి షబానా ఉంది. ఈ సమయంలో ఇబ్రహీం షబానా ఇంటికి చేరుకొని తనతో వచ్చేయాలని.. పెళ్లిచేసుకొని ఎక్కడికైనా వెళ్లిపోదామని పట్టుబట్టాడు. ఇందుకు షబానా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇబ్రహీం తన బైక్‌లోంచి పెట్రోల్‌ తీసి ఒంటిపై చల్లుకొని.. షబానా ఒంటిమీద కూడా కుమ్మరించి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న షబానాని…ఆమె వదిన కాపాడే ప్రయత్నం చేయడంతో ఆమెకి కూడా తీ2వ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. గత రాత్రే షబానా మృతి చెందగా.. ఇబ్రహీం ఇవాళ మృతి చెందాడు. యువతి వదిన పరిస్ధితా కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates