ప్రేమోన్మాది ఘాతుకం : టీచర్ల ముందే తల నరికేశాడు

MP-Girl-Beheaded-Jitled-manమధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. టీచర్లు, విద్యార్ధల కల్ల ఎదుటే ఓ ప్రేమోన్మాది యువతి తలను నరికి వేశాడు. అనుప్పూర్‌ జిల్లాలో గురువారం(ఫిబ్రవరి22) మధ్యాహ్నాం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

అనుప్పూర్‌ జిల్లాలోని  కోట్మా  టౌన్ కు చెందిన పూజా పనికా(17), నిగ్వాని రోడ్డులోని గవర్నమెంట్ స్కూల్ లో 11వ తరగతి చదువుతుంది. గురువారం స్కూల్ కి వెళ్తున్న సమయంలో పూజను ఓ యువకుడు వెంబడించాడు. స్కూల్ గేటు దగ్గరకి రాగానే తన దగ్గర ఉన్న తల్వార్ తో పూజపై దాడి చేశాడు. పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు పూజ తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
అయితే 2014లో పూజ ను వేధించాడన్న కారణంతో దిలీప్‌ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పూజ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్‌ అధికారి విజయ్‌ సింగ్‌ తెలిపారు. స్కూల్‌ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు స్కూల్ మూసివేస్తున్నట్లు మేనేజ్ మెంట్ ప్రకటించింది.
 

Posted in Uncategorized

Latest Updates