ప్రైమ్ డే సేల్స్ : అమెజాన్ బ్లాక్ బస్టర్ ఆఫర్స్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బీభత్సమైన ఆఫర్స్ ప్రకటించింది. జూలై 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయిన ప్రైమ్ డే సేల్స్.. 36 గంటలు కొనసాగనుంది. ఫ్లిప్ కార్ట్ – వాల్ మార్ట్ మధ్య డీల్ ఒకే అయిన తర్వాత దూకుడు పెంచిన అమెజాన్.. ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ప్రకటించింది. దేన్నీ వదిలిపెట్టకుండా.. సైట్ ఉన్న ప్రతి వస్తువుపై ఆఫర్ ప్రకటించేసింది. ప్రైమ్ మెంబర్ షిఫ్ ఉన్నవారికే ఇది వర్తిస్తోంది.

ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా కొత్తగా కొన్ని వస్తువులను కూడా లాంఛ్ చేస్తోంది అమెజాన్. ఇంటెల్ 8 ఇంచుల ల్యాప్ ట్యాప్, వన్ ప్లస్ 6 రెడ్, మెక్రో ఓవెన్స్, కొన్ని ఆహార పదార్థాలను కూడా లాంచింగ్ ఆఫర్స్ ఇచ్చింది. వన్ ప్లస్ 6 రెడ్ (8GB+128GB) ఎక్ఛేంజ్ పై అదనంగా రూ.2వేల తగ్గింపు ప్రకటించింది. ఇక హానర్, రెడ్ మీ వై2, శాంసంగ్ మొబైల్స్, హువావే, మోటో మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ ఆఫర్స్ కింద ప్రకటించింది. కనీసం 3 నుంచి 5వేల రూపాయల వరకు డిస్కొంట్ ఇస్తోంది. అదే విధంగా ఎక్చేంజ్ కింద మరో రూ.2వేల తగ్గింపు కూడా ప్రకటించింది అమెజాన్.

ప్రైమ్ డే సేల్స్ లో బంపరాఫర్ అంటే TCL టీవీలదే. రూ.48వేల విలువైన.. 55ఇంచ్ 4K స్మార్ట్ టీవీ కొనుగోలు చేస్తే.. 32ఇంచ్ టీవీని ఉచితంగా ఇస్తోంది. సెలక్ట్ చేసిన వాషింగ్ మెషీన్స్, ఫ్రిడ్జిలపై 10వేలు నుంచి 15వేల రూపాయల వరకు తగ్గింపు ఇస్తోంది. ల్యాప్ టాప్స్, వాచీలపైనా భారీ ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్.

అన్నింటి కంటే ముఖ్యంగా ఫ్యాషన్ పై తన ప్రతాపం చూపిస్తోంది. అత్యధికంగా 80శాతం వరకు డిస్కొంట్ ప్రకటించటం ఆశ్చర్యం. అన్ని కంపెనీల షూ, చెప్పల్స్ పై కనీసం 30శాతం నుంచి అత్యధికంగా 80శాతం వరకు డిస్కొంట్ ఇచ్చింది. అదే విధంగా వాచీలపై 30-70శాతం వరకు, లగేజీ, హ్యాండ్ బ్యాగ్ ఐటమ్స్ పై 40-70శాతం తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలపైనా భారీ స్థాయిలో ఈ తగ్గింపు ఉంది. అదీ ఇదీ అని లేకుండా అన్ని ఐటమ్స్ పై అమెజాన్ ఇస్తున్న ఈ బ్లాక్ బస్టర్స్ ఆఫర్స్ 36 గంటలు మాత్రమే.

Posted in Uncategorized

Latest Updates