ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Legislative_Assemblyప్రైవేటు యూనివర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్(ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ -2018 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం (మార్చి-28) ఈ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడిన అనంతరం కడియం శ్రీహరి సమగ్రంగా వివరించారు. అనంతరం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన సందేహాలను కడియం శ్రీహరి నివృత్తి చేశారు. ప్రైవేటు యూనివర్సిటీలను నెలకొల్పడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉందన్నారు. తెలంగాణ బిడ్డలకు అన్ని రకాలుగా విద్యావకాశాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువస్తున్నామని చెప్పారు.

పేద విద్యార్థులకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో కాదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.  ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రతిపక్షాలవి అపోహలు మాత్రమేనన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యావిధానం పటిష్టంతో పాటు, ప్రపంచస్థాయి విద్యే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెస్ చార్జీలను ఘననీయంగా పెంచిన ఘనత తమదేనని… పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఇచ్చే సాయం 20లక్షలు చేశామన్నారు కడియం.

బీజేపీ, టీడీపీ సీపీఎం పార్టీలు ప్రైవేటు  యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకించాయి.

Posted in Uncategorized

Latest Updates