ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

modi gud newsప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. డిపార్ట్‌ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ తరుపున 10 మంది జాయింట్ సెక్రటరీ పోస్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.  రెవెన్యూ, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎకానమిక్ అఫైర్స్, అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేలు, షిప్పింగ్, పర్యావరణం, అటవీ, వాతావరణ విభాగం, సివిల్ ఏవియేషన్, కామర్స్ లాంటి ఫీల్డుల్లో అనుభవం ఉన్న వాళ్లకోసమే ఈ బంపర్ ఆఫర్.

కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ మేనేజ్‌ మెంట్ లేవల్‌ లో జాయింట్ సెక్రటరీలు పని చేయాల్సి ఉంటుంది. దేశం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి వీళ్లు పని చేయాలి. దేశం కోసం తమ వంతు కృషి చేయాలి. దాని కోసం అనుభవజ్ఞలైన, టాలెంట్ ఉన్న భారత దేశ పౌరుల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుతున్నది.

జులై 1, 2018 నాటికి కనీసం 40 ఏండ్లు నిండి ఉన్న వాళ్లే ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎక్కవ విద్యార్హతలు ఉన్నా పర్లేదు. జులై 30, 2018 లోపు అప్లయి చేసుకోవాలి. షార్ట్‌ లిస్ట్ అయిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. సెలెక్ట్ అయిన వాళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో మూడేండ్లు కేంద్ర ప్రభుత్వంతో పని చేయాల్సి ఉంటుంది. బేసిక్ పే నెలకు రూ.1 లక్షా44 వేల 200 నుంచి 2 లక్షల18 వేల 200 వరకు ఉంటుంది. అలవెన్సులు అదనం.

Posted in Uncategorized

Latest Updates