ప్రొ కబడ్డీ : తెలుగు టైటాన్స్ విక్టరీ

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్–6లో శుభారంభం చేసింది తెలుగు టైటాన్స్. మంగళవారం (అక్టోబర్-9) జోన్‌-B లో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌ లో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (9 పాయింట్లు), మోసిన్‌ (7 పాయింట్లు), నీలేశ్‌ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో.. తెలుగు టైటాన్స్‌ 33–28తో తమిళ్‌ తలైవాస్‌ పై విక్టరీ సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన ఫస్ట్ 10 నిమిషాలు రెండు టీమ్స్ హోరాహారీగా తలపడినా.. ఆ తర్వాత రాహుల్‌ చౌదరి తెలివిగా ఆడటంతో.. తమిళ్‌ తలైవాస్‌ టీమ్ ఆలౌటైంది.

ఫస్టాఫ్ ముగిసేసరికి.. టైటాన్స్‌ 17–11తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో  తలైవాస్‌  పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్‌ తలైవాస్‌ తరఫున కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 9 రైడ్‌ పాయింట్లతో రాణించగా… ట్యాక్లింగ్‌ లో అమిత్‌ (6 పాయింట్లు) సత్తా చాటాడు. నేడు జరిగే మ్యాచ్‌ ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తో యు ముంబా, తమిళ్‌ తలైవాస్‌ తో బెంగళూరు బుల్స్‌ టీమ్స్ తలపడతాయి.

Posted in Uncategorized

Latest Updates