ప్రోమో ఎట్లా ఇస్తారు : IPL ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా?

CSK-v-KKRIPL సీజన్ -11 క్లైమాక్స్ కు చేరింది. మే 27న ఫైనల్ జరగనుంది. అందుకు మరో మూడు రోజుల టైం ఉంది. అంతే కాదండీ.. ఫైనల్ ఏయే జట్ల మధ్య జరుగుతుంది అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నా.. ప్రత్యర్ధి ఎవరు అనేది 25వ తేదీన కానీ తేలదు. కోల్ కతా వర్సస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో.. వారితో చెన్నై ఆడుతుంది. ఇది షెడ్యూల్. ఎవరు గెలిచేది ముందే చెప్పటం కష్టం. అయితే.. ఐపీఎల్ ప్రసార హక్కులు తీసుకున్న హాట్ స్టార్ మాత్రం 27వ తేదీ జరిగే ఫైనల్ మ్యాచ్ పై ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అంతే క్రికెట్ అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఫైనల్ ఆడేది చెన్నై వర్సస్ కోల్ కతా అని చెప్పింది. మ్యాచ్ జరక్కముందే హాట్ స్టార్ ఎలా డిసైడ్ చేస్తోంది.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి. ఇది పొరపాటున వచ్చిందా.. లేక ఎవరైనా కావాలని చేశారా అనేది కూడా తేలలేదు.

ఫైనల్ మ్యాచ్ KKR Vs CSK ఢీ అంటూ ప్రోమో ఊదరగొట్టింది హాట్ స్టార్. బుధవారం (మే-23) కోల్ కతా – రాజస్థాన్ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఈ ఫైనల్ మ్యాచ్ ప్రొమో వేసింది. ఎలిమినేటర్ మ్యాచ్ జరగకుండానే మ్యాచ్ ఫిక్స్ చేశారా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ జట్టును తక్కువ అంచనా వేసి.. ముందే ప్రోమో వేసిందని కొందరు అంటుంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మరికొందరు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియో జోరుగా తిరుగుతోంది. ఇంత పెద్ద రాద్దాంతం అవుతుందని ఊహించని హాట్ స్టార్.. వెంటనే ప్రోమో నిలిపివేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. శుక్రవారం (మే-25) ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా-హైదరాబాద్ మ్యాచ్. ఈ గేమ్ లో ఎలాగైనా గెలిచి, హాట్ స్టార్ లెక్కలను తలకిందులు చేయాలని హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కసితో ఉంది..  ఆల్ ది బెస్ట్ హైదరాబాద్.

Posted in Uncategorized

Latest Updates