ప్రో కబడ్డి : ప్లే ఆఫ్స్ కు యూపీ యోధ

కోల్ కతా : ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో UP యోధ విజృంభించింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ పై 41-25 తేడాతో గ్రేట్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో 57 పాయింట్లతో జోన్ B నుంచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఢిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్(55) పాయింట్లతో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. జోన్- A నుంచి గుజరాత్, U ముంబా, దబాంగ్ ఢిల్లీ..జోన్- B నుంచి బెంగళూరు, బెంగాల్, UP యోధ ప్లే ఆఫ్స్ కు చేరాయి.

యూపీ తరఫున రిషాంక్‌ 9, శ్రీకాంత్, నితేశ్‌ చెరో 6 పాయింట్లతో చెలరేగగా… బెంగాల్‌ తరఫున ఆదర్శ్‌ 4, జాంగ్‌ కున్‌ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్‌ లో బెంగళూరు బుల్స్‌ 40–32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పై గెలిచింది. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్‌–1లో U ముంబాతో UP యోధ, ఎలిమినేటర్‌–2లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ రాణించలేక పోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఓడి, ఈ సీజన్ కు టాటా చెప్పింది టైటాన్.

 

Posted in Uncategorized

Latest Updates