ప్లీజ్ అలర్ట్.. బీకేర్ ఫుల్ : వరస్ట్ పాస్ వర్డ్స్ ఇవే

passwordనా జీ మెయిల్ హ్యాక్ అయ్యింది.. నా ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారు.. నా ట్విట్టర్ లో నాకు తెలియకుండానే పోస్టులు పెడుతున్నారు.. నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతున్నాయి.. ఇలా బోలెడు కంప్లయింట్స్.. దీనికి కారణం హ్యాకర్స్. ఎందుకు మీ అకౌంట్ డీటెయిల్స్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లాయి అంటే… దానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీ అకౌంట్ సెక్యూరిటీ అయిన పాస్ వర్డ్ అనేది బలహీనంగా ఉండటం.. ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది వీక్ పాస్ వర్డ్స్ పెడుతున్నారంట. అందులో కొన్నింటిని సెక్యూరిటీ సంస్థలు విడుదల చేశాయి.

చెత్త పాస్ వర్డ్స్ లో కొన్ని ఇలా ఉన్నాయి :

12345, 1234567, 12345678, 654321, 987456, 456789 ఫుట్ బాల్, వాలీబాల్, క్రికెట్, వెల్ కమ్, మంకీ, లాగిన్, పాస్ వర్డ్, abc123, స్టార్ వార్స్, 123123, డ్రాగన్, మాస్టర్, హలో, ప్రీడం, వాటెవర్, blahblah, computer, tigger, hunter, sunshine,

… కొందరు అయితే కీబోర్డ్ పై ఉండే అక్షరాలను వరసగా ఇస్తున్నారు. ఉదాహరణకు qwerty, lkjhgf, asdfgh, zxcvbnm ఇలాంటివి కూడా ఎక్కువ మంది పెడుతున్నారు.

… కొందరు అయితే వారి పేర్లలోనే పాస్ వర్డ్ పెట్టటమే కాకుండా.. తల్లి, దండ్రుల పేర్లను సెక్యూరిటీగా ఇస్తున్నారు. మరికొందరు వారికి ఇష్టమైన ఆహార పదార్థాల పేర్లతోపాటు సీజన్ పేర్లను పెడుతున్నారు. మరికొందరు జంతువుల పేర్లను పెడుతున్నారు.

… మరికొందరు తమ పుట్టినరోజులనే పాస్ వర్డ్స్ గా పెట్టేస్తున్నారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు విశ్లేషకులు. మరికొందరు ఆయా రాష్ట్రాలు, విదేశాల్లో తమ ఇష్టమైన ప్రాంతాల పేర్లు పెడతారు. అదే విషయాన్ని ఇతరులతో షేర్ కూడా చేసుకుంటున్నారంట.

ఇవన్నీ చదివిన తర్వాత.. ఇవి కాకుండా ఇంకేమి పెట్టుకుంటాం.. ఆ మాత్రం మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. ఇది నిజమే. కాకపోతే.. మీ ఇష్టా, ఇష్టాలు, రెజ్యూమ్ అన్నీ సోషల్ మీడియాలో అప్ డేట్ చేసి ఉంటారు కదా అందులో నుంచి తీసుకుంటారు. మీ ఫేస్ బుక్ లో మీకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవటంతోపాటు.. మీ బయోడేటాలో కూడా ఇవన్నీ రాసి ఉంటారు. దీంతో హ్యాకర్స్ ఈజీగా మీ పాస్ వర్డ్స్ ను కనిపెట్టేస్తున్నారని స్ప్లాష్ డేటా అనే సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. నిత్యం డిజిటల్ ఫ్లాట్ ఫాంపై ఉండే వ్యక్తులు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు, జీమెయిల్, యాప్స్ ను ఉపయోగించే వారు పాస్ వర్డ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 2017లో కాకుండా 2018లోనూ 80శాతం మంది పాస్ వర్డ్స్ చాలా వీక్ గా ఉన్నాయని వెల్లడించింది ఈ సంస్థ. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి.. బీ కేర్ ఫుల్.

Posted in Uncategorized

Latest Updates