ఫలక్ నూమా ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను సందర్శించిన కడియం

హైదరాబాద్ పాతబస్తి ఫలక్ నూమా ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను 15 కోట్లతో మోడల్ క్యాంపస్ గా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సహకారంతో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. 15 రోజుల్లో ప్లానింగ్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తో కలిసి క్యాంపస్ ను పరిశీలించారు కడియం. ఒకే బిల్డింగ్ ఉండడంతో షిప్టుల పద్దతిలో గర్ల్స్, బాయ్స్ కాలేజీలు నడుస్తున్నాయని…త్వరలోనే గర్ల్స్ కాలేజీకి కొత్త భవనం నిర్మించి ఇస్తామన్నారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates