ఫలించిన కడియం కృషి : ఇంటర్మీడియట్ వరకు KGBVలు

KADIYAMHRDకస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ( KGBV) లను ఇంటర్మీడియట్ వరకు పొడిగించేందుకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అంగీకారం తెలిపారు. ఈ నెల చివర జరిగే కేంద్రకేబినెట్‌లో కేజీబీవీలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకాశ్‌జవదేకర్ స్పష్టమైన హామీనిచ్చారు. మంగళవారం (ఫిబ్రవరి-20) ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. విభజన చట్టంలో పొందుపర్చిన విద్యాసంస్థల ఏర్పాటు హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంటర్మీడియట్ వరకు యూనిఫామ్స్ అందించాలని కోరామని… హైదరాబాద్‌కు IIM కేటాయించాలని కోరామన్నారు. KGBV ల్లో ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ అమలు చేయడం వల్ల బాలికల డ్రాపవుట్లు తగ్గించడమే కాకుండా విద్యాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏపీకి మాదిరిగానే తెలంగాణకు ట్రిపుల్ ఐటీని కేటాయించాలని జవదేకర్ ను కోరినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా బాలికల విద్యాభివృద్ధికి తాము సూచించిన ప్రతిపాదనలు అమలు చేయడం వల్ల డ్రాప్ అవుట్లు తగ్గడమే కాకుండా విద్యాభివృద్ధికి దోహదపడుతుంది అన్నారు కడియం. KGBV ల కోసం కడియం గతంలో కూడా కేంద్రాన్ని కోరగా..ఇప్పుడు ఆయన కృషి ఫలించింది.

Posted in Uncategorized

Latest Updates