గ్రూప్2 ఫలితాల్లో సత్తా చాటిన రైతుబిడ్డలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: టీఎస్​పీఎస్సీ గ్రూప్‌‌‌‌-2 తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది. మొత్తం1032 పోస్టులకు గాను 1027 పోస్టులు భర్తీ చేశారు. ఎంపిక చేసిన అభ్యర్థుల్లో డిప్యూటీ తహసీల్దార్లు , ఎక్సైజ్‌‌‌‌ ఎస్సైలు, వాణిజ్య పన్నుల అధికారులు, మున్సిపల్‌‌‌‌ కమిషనర్ తదితర పోస్టులున్నాయి. ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన శివ చరణ్​ రెడ్డి, గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ఆవ అనిల్ కుమార్ ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికయ్యారు. మంచాల మండలం బండలేమూర్​గ్రామానికి చెందిన ప్రదీప్ ​డిప్యూటీ తహసీల్ధార్ గా సెలక్ట్​అయ్యాడు.

ఎంటెక్​ చదివి గ్రూప్2 జాబ్ ​కొట్టాడు

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిల్​కుమార్ పట్టుదలతో చదివి గ్రూప్2 లో ఎక్సైజ్‌‌‌‌ ఎస్సై జాబ్​సాధించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఆవ యాదయ్య, అండాలు దంపతుల కుమారుడు అనిల్​ఎన్ఆర్ఐ కాలేజ్​లో ఎంటెక్​ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో 2016లోనే పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. కానీ ఉద్యోగంలో చేరలేదు. మరోసారి 2018లో పోలీస్ కానిస్టేబుల్​గా ఎంపికయ్యాడు. గ్రూప్2 ఫలితాల్లో జాప్యం జరుగుతుందని కానిస్టేబుల్ శిక్షణకు రెడీ ఆయ్యాడు. ఇంతలో గ్రూప్2లో ఫలితాలు రావడంతో ఎక్సైజ్​ఎస్సై ఉద్యోగంలో చేరనున్నట్లు అనిల్ కుమార్​ తెలిపాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే గ్రూప్2 సాధించానన్నాడు.

డిప్యూటీ తహసీల్దార్​​గాఎస్సై ప్రదీప్​

పశువులు మేపుతూ చదువుకున్న వల్లపు​ప్రదీప్ గతంలో పోలీస్ ఎస్సైగా ఎంపికయ్యాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్​ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వల్లపు రంగయ్య, పార్వతమ్మ కుమారుడు ప్రదీప్​ ఎంఎస్సీ వరకు చదివాడు. 2016లో ఎస్సైగా ఎంపికై శిక్షణ తర్వాత నల్లగొండలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్​2 ఫలితాల్లో ప్రదీప్  డిప్యూటీ తహసీల్దార్​గా ఎంపికయ్యాడు. పేదవారి కష్టం తెలుసని వారికి సేవ చేయడానికే ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివి గ్రూప్స్2 ఉద్యోగం సాధించానని తెలిపాడు.

ఎక్సైజ్​ కానిస్టేబుల్ ​నుంచిఎక్సైజ్​ ఎస్సై

మేడిపల్లికి చెందిన శివ చరణ్​రెడ్డి గ్రూప్2లో ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఎక్సైజ్ కానిస్టేబుల్ గా కొడంగల్ ​లో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం రావడంతో అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates