ఫస్ట్​ నా మాట వినండి .. మోడీకి లిసిప్రియ ట్వీట్

వాతావరణ సమస్యలపై గళమెత్తి ఇండియన్ గ్రెటా థన్ బర్గ్ గా పేరొందిన ఏడేళ్ల లిసిప్రియ కంగుజమ్ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను తిరస్కరించింది. తనకు ఇలాంటి ప్రశంసలేమీ వద్దని, ముందు వాతావరణ సమస్యలపై దృష్టిసారించాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు #SheInspiresUs యాష్​ట్యాగ్ ద్వారా లిసిప్రియ గురించి MyGovIndia అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆమె పైవిధంగా స్పందించింది. ‘‘డియర్ నరేంద్ర మోడీజీ… మీరు నా మాటలు వినని పక్షంలో నా ఘనత గురించి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళల్లో ఒకరిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీరిచ్చే ఈ గౌరవాన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాను” అని లిసిప్రియ ట్విట్టర్​లో వెల్లడించింది.

నన్ను పొలిటికల్ గా వాడుకోవద్దు…

తన పోరాటం గురించి ప్రస్తావిస్తూ చేసిన పోస్టుపై స్పందిస్తూ లిసిప్రియ శుక్రవారం వరుసగా ట్వీట్స్ చేసింది. ‘‘డియర్ పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్… నాకు మీ నుంచి ప్రశంసలు అక్కర్లేదు. నన్నిలా కీర్తించే కంటే నా వాయిస్​ను పార్లమెంట్ లో వినిపించమని మీ ఎంపీలకు చెప్పండి.  మీ రాజకీయ లబ్ధి కోసం నన్నెప్పుడూ వాడుకోవద్దు. నేను మీకు ఫేవర్​గా ఉండను” అని ట్వీట్ లో పేర్కొంది. ‘‘మీ ఎంపీలు మూగ, చెవిటి, గుడ్డి వాళ్లు. ప్రభుత్వ పార్టీ ఎంపీలు అంతకంటే ఎక్కువ లేదా తక్కువ చేసిందేమీ లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. వెంటనే వాతావరణ సమస్యలపై స్పందించండి” అని మరో ట్వీట్​లో కోరింది. అయితే ఈ ట్వీట్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. లిసిప్రియ ట్విట్టర్ అకౌంట్​ను హ్యాండిల్​ చేస్తున్న గార్డియన్స్​ అభిప్రాయాలవి అని కొందరు యూజర్లు అన్నారు.

Latest Updates