ఫస్ట్ టైం ఆన్ లైన్ : ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

eamcet-2018ఎంసెట్ – 2018 షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఎగ్జామ్ తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని వెల్లడించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఫిబ్రవరి 27వ తేదీ : నోటిఫికేషన్ విడుదల

మే 2, 3 తేదీల్లో : అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు ఎగ్జామ్

మే 4, 5, 7 తేదీల్లో : ఇంజినీరింగ్ కోర్సులకు ఎగ్జామ్

స్టూడెంట్స్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400. ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.10వేల అపరాద రుసుముతో దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 20 నుంచి మే ఒకటో తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 6న నీట్ ఎగ్జామ్ ఉండటంతో.. ఆ రోజు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించటం లేదు. ఎగ్జామ్స్ పూర్తయిన 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల అవుతాయి. ఈసారి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్ లైన్ లో ఎంసెట్ నిర్వహించనున్నారు.

అభ్యర్థులు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేశారు పాపిరెడ్డి. నిమిషం నిబంధన విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి కాదని.. క్రమశిక్షణ కోసమని తెలిపారు. పరీక్ష 10 గంటలకు అయితే విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates