ఫస్ట్ టైం రికార్డ్ : దూరదర్శన్‌ లో IPL మ్యాచ్‌లు

IPLDDIPL మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని ప్రముఖ సంస్థ స్టార్ ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదాయాన్ని పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను సంస్థ ఉపయోగించుకుంటోంది. అలాగే దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియోలను నిర్వహించే ప్రభుత్వరంగ సంస్థ ప్రసారభారతితో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా దూరదర్శన్‌ లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వీలుకలుగుతుంది. దూరదర్శన్‌ లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ప్రతి ఆదివారం రెండు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. వారంలో ఒక కీలక మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారానికి గంట ఆలస్యంగా డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 50-50 రెవెన్యూ షేర్ ప్రాతిపదికన రెండు సంస్థలు అంగీకరించాయి. వీక్షకులు డీడీ నెట్‌వర్క్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చని ప్రసార భారతి ట్విటర్‌లో తెలిపింది.  ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఏదో ఒక మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో చూసే అవకాశం కలుగుతుందని స్టార్ స్పోర్ట్స్ సీఈవో ఉదయ్ శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం (ఏప్రిల్-8) రోజు జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ను గంట ఆలస్యంతో అంటే వారానికి ఒక మ్యాచ్‌ను ప్రసారం చేస్తాం. నేషనల్ బ్రాడ్‌కాస్టర్‌ తో ప్రసారాన్ని పంచుకోవడానికి ఇదేమీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కాదని ఆయన అన్నారు. అయితే ఈ ఒప్పందంతో తాము సంతృప్తి చెందిన క్రమంలోనే. .ఈ దీనిపై ముందడుగు వేసినట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates