ఫస్ట్ టైం 3 కోట్లకి చేరిన ఐటీ రిటన్స్

IT రిటన్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆన్ లైన్ వెసలుబాటు కల్పించడంతో ఐటీ రిటన్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య ఈ సంవత్సరం డబుల్ అయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (IT) రిటన్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య 3 కోట్లకు పెరిగింది.

పరిష్కరించిన రిఫండ్‌ కేసుల సంఖ్య 81 శాతం పెరిగి.. 65 లక్షలకు చేరుకున్నట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది 60 శాతం వరకూ ఆన్‌ లైన్‌ లో రిటన్స్‌ దాఖలు కాగా.. వాటి ప్రాసెసింగ్‌ కూడా ఇప్పటికే చేపట్టినట్లు చెబుతున్నారు అధికారులు. సామాన్య ప్రజలకు ఊరటగా ఆదాయ పన్ను శాఖ పన్ను రిటన్స్‌ దాఖలు చేసే తుది గడువును నెల రోజులు పొడిగించింది. ఆగస్టు 31 వరకూ ఐటీ రిటన్స్‌ దాఖలు చేసేందుకు డెడ్‌ లైన్‌ గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  ( CBDT) వెల్లడించింది. ఐటీ రిటన్స్‌ దాఖలు చేసేందుకు గడువును జులై 31 నుంచి ఆగస్ట్‌ 31 వరకూ పొడిగించిన క్రమంలో పన్ను చెల్లింపులో జాప్యం చేయకుండా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సకాలంలో పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ట్వీట్‌ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌.

Posted in Uncategorized

Latest Updates