ఫస్ట్ టైమ్ ఇన్ ది వరల్డ్: బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్ జెండర్

breastfeeding2ప్రపంచంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ తన బిడ్డకు పాలిచ్చింది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో ఈ వింత జరిగింది. 30 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ ఎలాంటి లింగ మార్పిడి, సర్జరీలు చేసుకోకుండానే తన బిడ్డకు పాలిచ్చింది. తన భాగస్వామి బిడ్డకు పాలివ్వడానికి నిరాకరించడంతో ఆమె మౌంట్ సినాయ్‌లోని సెంటర్ ఫర్ ట్రాన్స్‌జెండర్ మెడిసిన్ అండ్‌ సర్జరీలోని డాక్టర్లను ఆశ్రయించింది. వాళ్లు బిడ్డ పుట్టడానికి ముందు మూడు నెలల పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేశారు. బిడ్డ పుట్టే సమయానికి ఆమెలో చనుబాల వృద్ధి కనిపించింది. మొదట ఆరు వారాల పాటు అలా పాలిచ్చిన ఆమె, తర్వాత ఆరు నెలలపాటు కొనసాగించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఇచ్చే మందులకు సంబంధించి ఇది చాలా పెద్ద పురోగతి అని ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ టామర్ రీస్మాన్ తెలిపారు. ఈ వింత కేసును ట్రాన్స్‌జెండర్ హెల్త్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. డూ ఇట్ యువర్‌సెల్ఫ్ హార్మోన్ థెరపీ ద్వారా ట్రాన్స్‌జెండర్ మహిళలు గర్భం దాల్చొచ్చు, బిడ్డకు జన్మనివ్వవచ్చు అనడానికి ఈ కేసే నిదర్శనమని రీస్మాన్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates