ఫస్ట్ లుక్ : ఆఫీసర్ గా వస్తున్న నాగ్

officer posterరాంగోపాల్ వర్మని ఓదార్చుతున్నారు నాగార్జున. శ్రీదేవి మరణం తర్వాత మనోవేదనతో ఉన్న వర్మకి ధైర్యం చెప్పి బయటకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ – నాగ్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ ప్రకటించారు. ఆఫీసర్ అనే పేరు పెట్టారు ఈ సినిమాకి. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. గన్ పట్టుకుని షూట్ చేస్తున్న నాగ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. మే 20న మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇందులో నాగ్ సరసన మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. 25వ తేదీనే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కావాల్సి ఉంది. శ్రీదేవి మరణంతో వాయిదా పడింది.

Posted in Uncategorized

Latest Updates