ఫస్ట్ లుక్ : పవన్ నిర్మాణంలో ఛల్ మోహన్ రంగా

CHALకృష్ణ చైతన్య డైరెక్షన్ లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛల్ మోహన్ రంగ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం(ఫిబ్రవరి-11) రిలీజైంది. హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి, ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకున్నాడు. పవన్‌ కల్యాణ్‌ అంటే నితిన్‌కు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను త్రివిక్రమ్‌ పాటు పవన్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నితిన్‌, మేఘా ఆకాశ్‌లు గంతులేస్తుండడం ఆకట్టుకుంటోంది. లై సినిమా తరువాత నితిన్‌, మేఘా కలిసి నటిస్తున్న రెండో మూవీ ఇది. పీకే క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఛల్ మోహనరంగతో పాటు నితిన్‌ శ్రీనివాస కల్యాణం సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో  14 ఏళ్ల తరువాత నితిన్‌..దిల్‌రాజుతో కలిసి పనిచేస్తున్నాడు. సతీశ్‌ వేగేశ్న డైరెక్టన్ వహిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates