ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ : వర్మ బాగా సహకరించారన్న పోలీసులు

ింబCC S లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా వర్మను ప్రశ్నించారు పోలీసులు. వెబ్  సినిమా GST పై ఓ చానల్లో  చర్చ సందర్భంగా తనను దూషించారంటూ మహిళా సంఘం  నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. తనకు ఇచ్చిన నోటీసులపై  పోలీసులకు వివరణ ఇచ్చారు వర్మ. అడిగిన ప్రశ్నలు అన్నింటికీ బాగా సమాధానం చెప్పారని వెల్లడించారు పోలీసులు. ఇది ఇతర దేశాలతో ముడిపడిన అంశం అని.. మరోసారి కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. టెక్నికల్ అంశాలు చాలా సేకరించాల్సి ఉందని.. ఇప్పటికి అయితే వర్మ బాగా సహకరించారని.. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు పోలీసులు.

ఐటీ యాక్ట్- 66,67Aతో  పాటు.. చర్చావేదికల్లో అశ్లీలంగా  ప్రవర్తించటంపై 506, 509  సెక్షన్ల కింద  కేసులు  ఫైల్ చేశారు పోలీసులు.  మరోవైపు GST  సినిమాను  సమర్థించుకున్న  రామ్ గోపాల్ వర్మ  తీరుపై చాలానే  విమర్శలు వచ్చాయి. జీఎస్టీని  దేశంలో  విడుదల చేయకుండా  ఆదేశించాలని  కూడా కేసులు నమోదయ్యాయి.

verma (2)

verma (1)

Posted in Uncategorized

Latest Updates