ఫస్ట్ స్టెప్ : పవన్ JFC మీటింగ్

pawanకేంద్రం APకి ఇచ్చిన విభజన హామీలపై జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజనిర్ధాణ కమిటీ దసపల్లా హోటల్ లో సమావేశమైంది. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ కార్యాదర్శి రామకృష్ణతో పాటు ఆర్థిక నిపుణులు, మేధావులు హాజరయ్యారు. సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ, బీజేపీ, వైసీపీకి సొంత ఏజెండా ఉండటంతో మీటింగ్ కు రాలేదన్నారు. ఏపీకి వచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ నేతలు లెక్కలు చెప్పడం లేదన్నారు పవన్.

 

 

Posted in Uncategorized

Latest Updates