ఫస్ట్ స్టేజ్ లోనే చెప్పేస్తుంది : కేన్సర్ ను గుర్తించే పరికరం

BREATH CANCER బతికుండగానే మనుషుల ప్రాణాలను తినే భయంకర మహమ్మారి కేన్సర్ ను నివారించేందుకు రకరకాల పరిశోధనలు చేస్తున్నా..ఇప్పప్పటి వరకు పూర్తి స్థాయిలో మెడిసిన్ కనిపెట్టడంలో మాత్రం విఫమవుతూనే ఉన్నారు పరిశోధకులు. అయితే ఈ రోగాన్ని కనిపెట్టే ఓ సరికొత్త పరికరాన్ని మాత్రం కనిపెట్టినట్లు తెలిపారు సైంటిస్టులు. బ్రెత్ బయాప్సీ అనే పరికరాన్ని కనిపెట్టినట్లు తెలిపారు బిల్లీ బాయలల్ అనే బ్రిటిష్ సైంటిస్ట్. ఆయన ఆధ్వర్యంలో జరిపిన ఈ పరిశోధనలో ఈ గాడ్జెట్ మన ఊపిరి ఆధారంగానే వ్యాధి నిర్థారణ చేస్తుందన్నారు. భార్య కేట్‌ కు ఉన్న పెద్దపేగు కేన్సర్‌ ను సకాలంలో గుర్తించకపోవడం.. ఫలితంగా చిన్న వయసులోనే ఆమె మరణించడం బాయల్‌ మనసును కలచివేసింది.

ఇలాంటి చావు ఇతరులెవ్వరికీ రాకూడదని, వీలైనంత ముందుగా కేన్సర్‌ను గుర్తించే టెక్నాలజీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాయల్‌.. కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధించడం విశేషం.  మనిషికి రాగల వేర్వేరు కేన్సర్లలో కనీసం సగంవాటిని బ్రెత్‌ బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. తద్వారా శస్త్రచికిత్సతో చేసే బయాప్సీ అవసరం ఉండదు. కేన్సర్‌ సోకినప్పుడు మన కణాల్లో కొన్ని నాశనమై కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఊపిరి ద్వారా బయటకు వస్తూంటాయి. ఈ వొలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ను గుర్తించేలా బ్రెత్‌ బయాప్సీని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు కనబరచకపోయినా ఊపిరిత్తుల, కడుపులోని కేన్సర్‌ ను ఇది సులువుగా గుర్తించగలదు. కొన్ని ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఇది ఉపయోగపడుతుందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణకు ఇంజనీరింగ్‌ నోబెల్‌ అవార్డుగా పరిగణించే మెక్‌ రాబర్ట్‌ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates