ఫార్మా బిజినెస్ పేరుతో రూ.12 లక్షల మోసం..అరెస్ట్

PPఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఫార్మా ఆర్డర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పల్స్ ఫార్మా సూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం ఉన్న ఆర్డర్ కంటే ఎక్కువ ఇప్పిస్తానని మోసం చేశాడు కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్. ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతో.. ఫోర్జరీ లెటర్లను తయారు చేసి పల్స్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రతినిధి సురేష్ బాబును నమ్మించాడు. 7 కోట్ల 72 లక్షల 50వేల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇప్పిస్తానని.. అడ్వాన్స్ గా 12 లక్షలు తీసుకున్నాడు.

డబ్బు రిలీజ్ చేయాలని ఫేక్ లెటర్ ను ఆంధ్రా బ్యాంకుకు పంపాడు. బ్యాంకు అధికారుల ఎంక్వైరీలో ఫేక్ అని తేలడంతో.. పల్స్ ఫార్మా కంపెనీకి నిధులివ్వలేదు.  రామకృష్ణకు ఫోన్ చేస్తే స్విచాఫ్ రావడంతో.. పోలీసుల్ని ఆశ్రయించింది పల్స్ ఫార్మా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఫోర్జరీ లెటర్లతో మోసం చేస్తున్న రామకృష్ణను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు పేరుతో ఉన్న ఫోర్జరీ లెటర్ హెడ్ లను.. తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారుల పేరుతో ఉన్న స్టేషనరీ స్వాధీనం చేసుకున్నారు. మూడు రబ్బర్ స్టాంపులు, హ్యుందాయ్ క్రెటా కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates