ఫాలోవర్స్ ఎక్కువుంటే ఇంతే : ఒక్క ట్విట్ తో రూ.8వేల కోట్ల నష్టం

j1ఒక్క ట్వీట్.. ఒకే ఒక్క ట్వీట్ తో అక్షరాల రూ.8వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది స్నాప్ చాట్. సెలబ్రిటీలు తమ కంపెనీ గురించి ట్వీట్ చేస్తే ప్రచారం దక్కుతుందని కంపెనీలు భావిస్తాయి. అయితే రియాలిటీ స్టార్ కైలీ జెన్నర్ గురువారం(ఫిబ్రవరి 22) చేసిన ఓ ట్వీట్‌తో స్నాప్ ఇంక్ షేర్ల మార్కెట్ విలువ దారుణంగా పడిపోయింది.

కొన్ని రోజుల క్రితం స్నాప్‌చాట్ ఓ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ఇది నచ్చకపోవడంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ అప్‌డేట్‌ను తొలగించాలని 12 లక్షల మంది ‘ఛేంజ్.ఓఆర్‌జీ’ పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఈ సమయంలో కైలీ జెన్నర్ గురువారం ఓ ట్వీట్ చేసింది. ఇకపై స్నాప్‌చాట్‌ను ఓపెన్ చేయని వారెవరైనా ఉన్నారా? నేనొక్కదాన్నేనా.. అబ్బా, ఇది చాలా శోచనీయమంటూ కైలీ ట్వీట్ చేసింది. కైలీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే స్నాప్ ఇంక్ మార్కెట్ విలువ రూ.8,422 కోట్లకు పడిపోయింది. అదే సమయంలో కైలీ మరో ట్వీట్ చేసింది. నేనింకా నిన్ను ఇష్టపడుతున్నాను స్నాప్.. మై ఫస్ట్ లవ్ అంటూ ట్వీట్ చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కైలీ జెన్నర్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న కైలీ దెబ్బకి ఓ కంపెనీ ఢమాల్ అంది. అంతే కదా.. ఓ సెలబ్రిటీ ట్విట్ కంపెనీని నిలబెట్టొచ్చూ.. పడగొట్టొచ్చు.. ఒకే ఒక్క ట్విట్ తో అని నిరూపించింది కైలీ..

 

Posted in Uncategorized

Latest Updates