ఫాలో ఆన్ లో విండీస్.. 468 రన్స్ ఆధిక్యంలో ఇండియా

రాజ్ కోట్ : రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ ధాటికి వెస్టిండీస్ విలవిల్లాడిపోతోంది. తొలి ఇన్నింగ్స్ లో వెస్ట్ ఇండీస్ 181  పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 468 రన్స్ ఆధిక్యం దక్కింది.

94/6 స్కోరుతో మూడోరోజు ఆట మొదలుపెట్టిన వెస్ట్ ఇండీస్ ఎంతో సేపు నిలువలేకపోయింది. మరో 19 ఓవర్లు మాత్రమే ఆడి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు టెయిలెండర్లు 87 రన్స్ జోడించగలిగారు. చేజ్ 53, పాల్ 47 రన్స్ చేశారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు, షమీ 2, ఉమేష్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 649/9 స్కోరుపై డిక్లేర్ చేయడంతో… భారత్ కు 468 రన్స్ భారీ లీడ్ దక్కింది. వెస్ట్ ఇండీస్ ఫాలో ఆన్ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్ లోనూ ఇబ్బందిపడుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates