ఫించ్ బాదుడుకి బాల్ బద్దలు : టీ 20లో 172 రన్స్

FINCHఆస్ట్రేలియా కెప్టెన్…ఓపెనింగ్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ టీ-20ల్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మంగళవారం (జూలై-3) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 76 బాల్స్ లోనే 172 రన్స్ చేశాడు. టీ-20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో 156 పరుగులతో తన పేరుతో ఉన్న రికార్డును ఫించ్…మరోసారి తిరగరాశాడు. జింబాబ్వే బౌలింగ్ ను చీల్చి చెండాడిన ఫించ్.. కేవలం 22 బాల్స్ లో హాఫ్ సెంచరీ, 50 బాల్స్ లో సెంచరీ చేశాడు.

ఆ తర్వాత మరో 26 బాల్స్ లో 72 రన్స్ చేశాడు. మొత్తం ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 10 సిక్స్ లు కొట్టాడు. ఫించ్ వీరబాదుడుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 229 పరుగులు చేసింది.
అనంతర లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 రన్స్ మాత్రమే చేసి, ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Posted in Uncategorized

Latest Updates