ఫిట్ నెస్ ఇండియా : ఈ ఛాలెంజ్ కు మీరు రెడీనా

FitnessChallengeఐస్ బకెట్ చాలెంజ్ గుర్తుంది కదా.. అలాగే ఫిటెనెస్ చాలెంజ్ కి పిలుపునిచ్చారు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. ఇండియా ఫిట్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ నెస్ గురుగా మారిన రాథోడ్.. అందరూ ఫిట్ గా ఉండాలని కోరారు. మీ ఫ్రెండ్స్ తో ఈ ఫిట్ నెస్ చాలెంజ్ చేయండంటూ తన ఆఫీస్ రూంలో 10 డిప్స్ తీస్తూ తీసిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇతరులకు రోల్ మోడల్ గా ఉండాలని పిలుపునిచ్చాడు.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఏస్ ఇండియన్ షట్లర్ సైనా నెహ్వాల్, టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఈ చాలెంజ్ లో జాయిన్ అవ్వాలని స్వయంగా కోరాడు ఈ కేంద్ర మంత్రి రాథోడ్. రాథోడ్ చాలెంజ్ కు ఇప్పుడు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. రాథోడ్ చాలెంజ్ ని స్వీకరించిన సైనా నెహ్వాల్, హృతిక్ రోషన్ తమ ఫిటెనెస్ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, క్రీడాకారులు పీవీ సింధూ, గౌతమ్ గంభీర్ కూడా ఈ చాలెంజ్ ని స్వీకరించాలని సైనా ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ అందరూ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూనే.. మిగతా వారికి పిలుపునిస్తున్నారు. హృతిక్ రోషన్ అయితే సైకిల్ తొక్కుతూ ఫిట్ నెస్ ఇండియాకు సపోర్ట్ చేశారు. ఇక టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా డిప్స్ తీస్తూ ఛాలెంజ్ స్వీకరించారు. ఇక వారి ఫ్యాన్స్, నెటిజన్స్ అందరూ కూడా జయహో ఫిట్ నెస్ ఇండియా అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ ఫిట్ నెస్ చూపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates