ఫిఫా వరల్ట్ కప్-2018: క్వార్టర్స్ కు బ్రెజిల్

brjilఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో బ్రెజిల్‌ జిగేల్‌మంది. రెండో రౌండ్‌లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో వరసగా ఏడో ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన జట్టుగా నిలిచింది. బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ 51 నిమిషంలో,ఫర్మినో 88వ నిమిషంలో గోల్స్‌ సాధించారు.

ఫస్ట్ ఆఫ్ పోటాపోటీగా జరిగినప్పటికీ విరామ సమయం తర్వాత బ్రెజిల్‌ దూకుడు పెంచింది. రెండు గోల్స్‌ కొట్టడంతో పాటు బ్రెజిల్‌ రక్షణ శ్రేణి బలంగా ఉండటంతో మెక్సికో గోల్‌ యత్నాలు ఫలించలేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌ల్లోనూ బ్రెజిల్‌ పాల్గొంది.

క్వార్టర్ ఫైనల్స్ లో బ్రెజిల్ …బెల్జియమ్ తో తలపడనుంది.

Posted in Uncategorized

Latest Updates