ఫిఫా వరల్డ్ కప్ : ఇంగ్లాండ్ పై 1-0 తేడాతో గెలిచిన బెల్జియం

bgసాకర్ ఫేవరేట్లుగా బరిలో దిగిన ఇంగ్లాండ్-బెల్జియం మధ్య తోపేవరో తేలిపోయింది. ఇంగ్లాండ్ పై బెల్జియం 1-0 తేడాతో గెలిచింది. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లో ఆడిన రెండు టీంలు.. సెకండ్ హాఫ్ లో అటాకింగ్ మొదలుపెట్టాయి. టార్గెట్ ఫినిష్ చేయడంలో బెల్జియం సక్సెస్ అయింది. ఇంగ్లాండ్ ఫెయిలైంది. 51వ నిమిషంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ అద్నాన్ జనుజాజ్ ఏకైక గోల్ చేశాడు. దాంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఇంగ్లాండ్ దాడులు పెంచింది. అయినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి ఈ మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండానే క్వార్టర్స్ చేరాయి రెండు టీంలు. అయితే గ్రూపు టాపర్ గా నిలిచేదెవరన్నదే సస్పెన్స్. ఈ మ్యాచ్ లో గెలుపుతో గ్రూప్-జీ టాపర్ గా నిలిచింది బెల్జియం. ఇదే గ్రూప్ లో పనామాతో పోటీపడింది ట్యూనీషియా. 2-1 తేడాతో గెలిచింది. ఇక సోమవారం జపాన్ తో నాకౌట్ మ్యాచ్ ఆడనుంది బెల్జియం. మంగళవారం ఇంగ్లాండ్ కొలంబియాతో తలపడుతుంది.

Posted in Uncategorized

Latest Updates