ఫిఫా వరల్డ్ కప్ : నాకౌట్ కు చేరిన అర్జెంజీనా

argentina winఫీఫాలో సంచలనాలకు తావివ్వకుండా.. అర్జెంటీనా నాకౌట్ కు చేరింది. మంగళవారం (జూన్-26)  లేట్ నైట్ నైజీరియాతో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో గెలిచి గ్రూప్ డీ నుంచి రౌండ్-16కు చేరింది మెస్సీ గ్యాంగ్. గెలిస్తే తప్ప నాకౌట్లోకి ప్రవేశించలేని స్థితిలో నైజీరియాపై అద్బుత విజయం సాధించింది అర్జెంటీనా. ఫుట్ బాల్ వరల్డ్ ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్ లో అర్జెంటీనాను నాకౌట్ చేర్చాడు మార్కొస్ రోజో . 14వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన మెస్సీ.. అర్జెంటీనాను లీడ్ లోకి తీస్కెళ్లాడు.

రష్యా టోర్నీలో నమోదైన వందో గోల్ అది. 49వ నిమిషంలో జేవియర్ ఫౌల్ తో నైజీరియాకు పెనాల్టీ లభించింది. దాన్ని మోసెస్ గోల్ చేశాడు. అర్జెంటీనా షాక్. అయితే మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా 86వ నిమిషంలో మార్కస్ రొజో అద్భుతమైన గోల్ తో అర్జెంటీనాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో విజయంతో 2006 వరల్డ్ కప్ నుంచి ప్రతీసారి నాకౌట్ చేరిన టీంగా రికార్డు సృష్టించింది అర్జెంటీనా. అటు గ్రూప్ సీ నుంచి ఫ్రాన్స్-డెన్మార్క్ రౌండ్-16లోకి ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ తో, డెన్మార్క్ తో క్రొయేషియా ఫైట్ చేయబోతున్నాయి.

Posted in Uncategorized