ఫిఫా వరల్డ్ కప్-2018: ఇవాళ ఫ్రాన్స్, క్రొయేషియాల మధ్య ఫైనల్ పోరు

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. నెలరోజులకు పైగా సాగిన పోటీల్లో విజేత ఎవరో ఇవాళ (ఆదివారం,జులై-15) తేలిపోనుంది. ఫ్రాన్స్‌, క్రొయేషియా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్‌ తదితర స్టార్‌ ఆటగాళ్లతో కూడిన జట్లన్నీ ఇంటిముఖం పట్టగా… లుకా మోడ్రిక్‌ కెప్టెన్సీలో క్రొయేషియా, హ్యూగో లారిస్‌ ఆధ్వర్యంలో ఉన్న ఫ్రాన్స్‌ ఫైనల్లో నిలిచాయి. ఫైనల్ పోటీని చూసేందుకు ప్రపంచం నలుమూలలనుంచి రష్యా చేరుకున్న అభిమానులతో రష్యా రంగులమయంగా మారింది.

రెండు యూరోపియన్‌ దేశాల నడుమ సాగనున్న ఈ ఫైనల్ పోరులో ఏ దేశ జట్టు గెలిచినా కప్‌ తమ ఖండానికే వస్తుందని ఆ జట్లు భావిస్తున్నాయి. చివరిసారిగా 1998లో ట్రోఫీ గెలిచిన ఫ్రాన్స్‌ మరోసారి కప్‌ గెలవాలని ఆశిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates