ఫిఫా వరల్డ్ కప్-2018: క్వార్టర్స్ కి స్వీడన్

sweedanఫిఫా నాకౌట్‌ పోటీల్లో భాగంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో మంగళవారం(జులై-3) స్వీడన్‌-స్విట్జర్లాండ్‌ టీంల మధ్య జరిగిన పోటీలో స్వీడన్‌  విజయం సాధించింది. 1-0 గోల్‌ తేడాతో గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. దీంతో 24 ఏళ్ల తర్వాత మొదటి సారిగా స్వీడన్ క్వార్టర్స్ ఫైనల్ కి చేరుకుంది.

ఆట ప్రారంభం నుంచి రెండు జట్లు గోల్‌ చేయడానికి పోటీ పడ్డా ఫలితం లేకపోయింది. హాఫ్‌ టైం గడిచేసరికి స్కోరు 0-0గా ఉంది. మొదటి  28 నిమిషాల్లో స్వీడన్‌ ఆటగాడు మార్కస్‌ బెర్గ్‌ 13 షాట్లు కొట్టి గోల్‌కోసం ప్రయత్నించాడు.బ్రేక్ తర్వాత ఇరు జట్లు పోటాపోటీగా సాగాయి. ఆట 66వ నిమిషంలో స్వీడన్‌ గోల్‌ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్వీడన్‌ మిడ్‌ ఫీల్డర్‌ టయ్‌వోనిన్‌ అందించిన పాస్‌ను ఎమిల్‌ ఫోర్స్‌బెర్గ్‌ గోల్‌ చేశాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఎమిల్‌ కిది మొదటి గోల్‌. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యే సరికి 1-0తో స్వీడన్‌ ఆధిక్యంలో ఉంది. అదనపు 7 నిమిషాల ఆటలో స్వీట్జర్లాండ్‌ ఆటగాడు మైకేల్‌ లాంగ్‌ రెడ్‌ కార్డ్‌ పొందడంతో గ్రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆటలో స్వీడన్‌ ఒక ఎల్లో కార్డు పొందగా, స్విట్జర్లాండ్‌ రెండు ఎల్లో కార్డులు, ఒక రెడ్‌ కార్డ్‌ పొందింది.
ఇప్పటివరకు ఏడు సార్లు నాకౌట్లోకి ప్రవేశించినప్పటికి స్విట్జర్లాండ్‌ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.

Posted in Uncategorized

Latest Updates