ఫిఫా వరల్డ్ కప్-2018 : క్వార్టర్స్ కు చేరిన క్రొయేషియా

kroaసాకర్ వరల్డ్ కప్ లో క్రొయేషియా క్వార్టర్స్ కు చేరింది. డెన్మార్క్ పై గెలిచి నెక్ట్స్ రౌండ్ కు చేరింది. ఆదివారం(జులై-1)  మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే డెన్మార్క్ ప్లేయర్ జార్గాన్ సేన్ గోల్ చేసి రికార్డు సృష్టించాడు. నాలుగో నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మండ్జూకిక్ గోల్ తో స్కోర్ ఈక్వల్ అయింది. తర్వాత గోల్ కోసం ఇరుజట్లు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఎక్స్ ట్రా టైంలోనూ గోల్స్ రాలేదు. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా క్రొయేషియా ప్లేయర్ రెబెక్ గోల్ చేసినంత పనిచేశాడు. పెనాల్టీ ఛాన్స్ వచ్చినా వినియోగించుకోలేకపోయింది. దాంతో షూటౌట్ కు దారితీసింది మ్యాచ్. షూటౌట్ లో 3-2 గోల్స్ తేడాతో గెలిచింది క్రొయేషియా. శనివారం(జులై-7 రష్యాతో ఫైట్ చేయనుంది. 1998 తర్వాత క్రొయేషియాకు ఇదే బెస్ట్ పర్ ఫామెన్స్. ఫ్రాన్స్ లో జరిగిన వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన క్రొయేషియా ఆ టోర్నీలో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో గ్రూప్ దశ దాటలేదు. 2010లో క్వాలిఫై కాలేదు.

 

Posted in Uncategorized

Latest Updates