ఫిఫా వరల్డ్ కప్-2018 : ఫేవరేట్ స్పెయిన్ పై రష్యా స్టన్నింగ్ విక్టరీ

rusసాకర్ టోర్నీలో మరో సంచలనం. టైటిల్ రేసు నుంచి మరో ఫేవరేట్ క్రాష్ ఔట్ అయింది. స్పెయిన్ పై హోస్ట్ నేషన్ రష్యా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. పెనాల్టీ షూటౌట్ లో 4-3 గోల్స్ తేడాతో ఓడింది మాజీ ఛాంపియన్..  హోస్ట్ నేషన్ రష్యా తొలిసారి క్వార్టర్స్ చేరింది. గోల్ కీపన్ అకిన్ ఫీవ్ రష్యా హీరోగా మారాడు.

వెయ్యికి పైగా పాస్ లు. గెలుపే లక్ష్యంగా అటాకింగ్ గేమ్. డీగో కోస్టా, ఇస్కో, సెర్గియో రామోస్, ఆండ్రీస్ ఇనియెస్టా లాంటి స్టార్ ప్లేయర్లున్నా… స్పెయిన్ మట్టికరించింది. హోస్ట్ నేషన్ రష్యా… మాజీ ఛాంపియన్ ను ఓడించి  సంచలనం సృష్టించింది.

సాకర్ టోర్నీలో స్పానిష్ గేమ్ ఇంట్రెస్టింగ్. టికా టికా టెక్నిక్ తో ఉర్రూతలూగించిన చరిత్ర ఆ టీం సొంతం. అలాంటి  స్పెయిన్… ఈ టోర్నీలో అసలు సోదిలోనే లేని రష్యా చేతిలో ఓడటం డిజాస్టర్లకే డిజాస్టర్. 12వ నిమిషంలో రష్యా ప్లేయర్ సెర్గియో ఇగ్నసేవిచ్ సెల్ఫ్ గోల్ తో స్పెయిన్ అధిక్యంలో కెళ్లింది. 40వ నిమిషంలో పిక్యూ హ్యాండ్ బాల్ తో దొరికిన పెనాల్టీని రెండు చేతులా అందుకుంది రష్యా. రష్యా ఆటగాడు జ్యూబా పెనాల్టీని గోల్ గా మలిచి… స్కోర్ ని సమం చేశాడు.

నిర్ణీత సమయం ముగిసి.. ఎక్స్ ట్రా టైం ఆడినా మరో గోల్ చేయలేకపోయాయి రెండు టీంలు. దాంతో పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది మ్యాచ్. షూటౌట్ లో 4-3తో ఓడింది స్పెయిన్. రష్యా ఆటగాళ్లు నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధిస్తే.. స్పెయిన్ తరఫున కొకే.. లాగా ఆస్పాస్ ఫెయిలయ్యారు. మ్యాచ్ లో 79 శాతం బాల్ స్పెయిన్ కంట్రోల్లోనే ఉంది. పదకొండు వందల 14 పాస్ లు ఇచ్చుకున్నారు స్పెయిన్ ఆటగాళ్లు. గోల్ పోస్ట్ టార్గెట్ గా 9 షాట్స్ కొట్టారు. కానీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. మొత్తమ్మీద రష్యా గోల్ కీపర్ అకిన్ ఫీవ్ స్పెయిన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని హీరోగా నిలిస్తే… స్పెయిన్ దిగ్గజాలు జీరోలుగా మారారు.

స్పెయిన్ ఫెయిల్యూర్ కు చాలా కారణాలే ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్. ర్యాంకింగ్ లో తనకన్నా ఎంతో దూరంలో ఉన్న రష్యాను తక్కువ అంచనా వేసి బరిలో దిగడం మెయిన్ రీజన్స్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మ్యాచ్ లో రష్యాను డిఫెండ్ చేసుకోవడానికి స్పానిష్ టీం… టైం వేస్ట్ చేయడం ఒక కారణమైతే… డీగో కోస్టాను సరిగా వాడుకోకపోవడం మరో కారణం. స్ట్రైకర్ రోడ్రిగోను ఎక్స్ ట్రా టైంలో బరిలో దింపడం మరో ఫెయిల్యూర్. మొత్తంగా రష్యాను తక్కువ అంచనా వేసి నిండా మునిగింది స్పెయిన్. ఈ విజయంతో రష్యా క్వార్టర్స్ కు చేరింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా బెస్ట్  పర్ ఫామెన్స్ ఇదే. పెనాల్టీ షూటౌట్స్ కారణంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం స్పెయిన్ కు ఇది మూడోసారి. శనివారం(జులై-7) జరగనున్న క్వార్టర్ ఫైనల్లో రష్యా… క్రొయేషియాతో తలపడుతుంది.

 

Posted in Uncategorized

Latest Updates