ఫిఫా వరల్డ్ కప్-2018: సెమీస్ కు ఫ్రాన్స్

franceఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ దూసుకుపోతోంది. క్వార్టర్స్‌లో మాజీ ఛాంపియన్‌ ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి రెండు దేశాల జట్లు పోటాపోటీగా పోరాడాయి. ఇందులో ఉరుగ్వే ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. దీంతో విజయం మాత్రం ఫ్రాన్స్‌నే వరించింది.

ఫస్ట్ ఆఫ్ లో గోల్‌ కోసం రెండు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో మ్యాచ్‌ 40వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు వరానే హెడర్‌గోల్‌తో తన జట్టుకు మొదటి గోల్‌ అందించాడు. సెకండ్ ఆఫ్ లో ఇరు జట్లూ గోల్‌ కోసం ప్రయత్నించాయి. ఈ క్రమంలో 61వ నిమిషంలో గ్రీజ్‌మన్‌ గోల్‌ చేసి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో ఉరుగ్వేపై ఫ్రాన్స్ గెలుపొందింది.

 

Posted in Uncategorized

Latest Updates