ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

దక్షిణ ఫిలిప్పీన్స్ ఐ ల్యాండ్ లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది సముద్రతలానికి 60 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. దీంతో 300 కిలో మీటర్ల దూరం వరకూ భూమి కంపిస్తుందని… పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా హవాయికి సునామీ వల్ల ప్రమాదమేమీ లేదని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates