ఫీఫా వరల్డ్ కప్ : రష్యాకు రెడీ అవుతున్న ఇండియన్ టూరిస్టులు

RUSIYAవచ్చే నెల 14 నుంచి రష్యాలో మొదలుకాబోతున్న ఫీఫా వరల్డ్ కప్ కోసం క్రీఢాభిమానులు, పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాకర్ సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రష్యా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఇండియన్ టూరిస్టులు. గతేడాదితో పోలిస్తే రష్యా టూర్ కు వెళ్తున్న భారతీయుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఏకంగా 15 లక్షల మంది భారతీయులు రష్యాలో విహరించేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. వరల్డ్ కప్ కోసం జనవరి నుంచే పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకుంటున్నారట. మార్చి వరకు బుకింగ్స్ క్లోజ్ అయ్యాయంటున్నారు ట్రావెల్ ఆపరేటర్స్. విజిటర్స్ కోసం అట్రాక్టివ్ ప్యాకేజెస్ తో ఆకట్టుకుంటున్నారు ట్రావెల్ ఆపరేటర్స్. మాస్కో, పీటర్స్ బర్గ్, సోచి సిటీలను విజిట్ చేసేలా ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates